భారీ వర్షాలకు నిండుకుండలా ప్రాజెక్టులు

దిశ, వెబ్‎డెస్క్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీ వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 7,49,807 క్యూసెక్కలుగా కొనసాగుతుండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుంకేశుల ప్రాజెక్టు వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 61,240 క్యూసెక్కులు కొనసాగుతుండగా.. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్‎ఫ్లో 3,91,416, ఔట్‎ఫ్లో 4,11,885 క్యూసెక్కులు కొనసాగుతున్నాయి. కాగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో […]

Update: 2020-10-14 22:36 GMT

దిశ, వెబ్‎డెస్క్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీ వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 7,49,807 క్యూసెక్కలుగా కొనసాగుతుండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుంకేశుల ప్రాజెక్టు వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 61,240 క్యూసెక్కులు కొనసాగుతుండగా.. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్‎ఫ్లో 3,91,416, ఔట్‎ఫ్లో 4,11,885 క్యూసెక్కులు కొనసాగుతున్నాయి.

కాగా, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 3,69,866 క్యూసెక్కులు… పులిచింతల వద్ద ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో 5,47,418 క్యూసెక్కులుగా ఉంది. వంశధార నదికి వరద నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముంపు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News