సాయం అందలే.. నాయకులే తిన్నరు!

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ వరద బాధితులు ఆందోళన బాటపట్టారు. తాము వరదలతో సర్వం కోల్పోయాం. మాకు న్యాయం చేయండి. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాకారాన్ని మాకు అందకుండా పోయింది. మమ్మల్ని ఆదుకోండి. అంటూ బాధితులు నేరుగా కార్పోరేటర్ల ఇండ్లను ముట్టడిస్తున్నారు. రోడ్డెక్కి నినదిస్తున్నారు. రస్తారోకోలు చేస్తున్నారు. శుక్రవారం మల్కాజిగిరి, సికింద్రాబాద్, నియోజకవర్గాల్లోని దాదాపు 100 మంది వరద బాధితులు భారీగా ర్యాలీని నిర్వహించారు. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినదించారు. ప్లకార్డులు చేతబూని రోడ్డుపై బైఠాయించారు. […]

Update: 2020-11-13 10:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ వరద బాధితులు ఆందోళన బాటపట్టారు. తాము వరదలతో సర్వం కోల్పోయాం. మాకు న్యాయం చేయండి. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాకారాన్ని మాకు అందకుండా పోయింది. మమ్మల్ని ఆదుకోండి. అంటూ బాధితులు నేరుగా కార్పోరేటర్ల ఇండ్లను ముట్టడిస్తున్నారు. రోడ్డెక్కి నినదిస్తున్నారు. రస్తారోకోలు చేస్తున్నారు. శుక్రవారం మల్కాజిగిరి, సికింద్రాబాద్, నియోజకవర్గాల్లోని దాదాపు 100 మంది వరద బాధితులు భారీగా ర్యాలీని నిర్వహించారు. ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినదించారు. ప్లకార్డులు చేతబూని రోడ్డుపై బైఠాయించారు. తమ గోసను ఇలాగైనా విని ప్రభుత్వం స్పందిస్తుందని ఆశ పడుతున్నారు. కానీ, బాధితులు గొంతెత్తి అరిచినా, కార్పోరేటర్లను కలిసి విన్నివించినా ..వారు గానీ, వారి ప్రభుత్వంగానీ స్పందించడంలేదు. పైగా పోలీసులను పిలిచి వెళ్ళగొడుతున్నారు. బెదిరిస్తున్నారు. హెచ్ఛరిస్తున్నారు. దీంతో బాధితులు చేసేదేమి లేక మునిసిపల్ కార్యాలయాలకు చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నారు.

దీపావళి పండుగకు..

తెల్లారితే దీపావళి పండుగ. అయినా, శుక్రవారం భారీ స్థాయిలో మహిళలు ర్యాలీని నిర్వహించారు. మల్కాజిగిరి మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. నేరేడ్ మెట్ చౌరస్తాలోనూ రస్తారోకో నిర్వహించారు. పండుగ పర్వదినాన కనీసం తిండితినలేని స్థితిలో ఉన్నామని ఇండ్లలో ఏమి లేక వంటలేక పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని వారు దిగాలుగా చెప్పారు. గతంలో ఓ కార్పోరేటర్ ఇంటిని ముట్టడిస్తే… అతని భార్య జోక్యంచేసుకుని పోలీసులను పిలిచి అందరినీ వెళ్ళగొట్టారు. మరో కార్పోరేటర్ ఇంటికి వెళ్ళితే ఆయన పోలీసులను పిలిచి కొట్టేంత పనిచేయించారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.

నాయకులే తిన్నరు..

ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు అందించిన ఆర్థిక సహాకారాన్ని చాలా వరకు పార్టీ నాయకులే తిన్నారని వారు ఆరోపిస్తున్నారు. గులాబీ కండువలు వేసుకుని మరీ అటు ఇవ్వగానే ఇటు సగం తీసుకున్నారని, వారిని ప్రశ్నిస్తే మా ప్రభుత్వం ఇస్తున్నందున మాకు ఇవ్వాల్సిందేనంటూ జబర్దస్తూ రూ. 10 వేల నుంచి రూ. 5 వేలు తీసుకుని మా కడుపు కొట్టారని వారు తిట్లదండకం మొదలుపెట్టారు. చాలా మంది నిజమైన బాధితులు కానివారే తీసుకున్నారని, దీంతో నిజమైన బాధితులకు ప్రభుత్వ సహాయం చేరలేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారులు తమ వద్దకు రాలేదని వారు ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. పార్టీ నాయకులే నగదు తీసుకొచ్చి వారికి అనుకూలంగా ఉన్నవారికి అందించి , మిగతాది మొత్తం ఖాజేసినట్టు వారు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News