ధర్నాలతో దద్ధరిల్లిన బల్దియా

దిశ, తెలంగాణ బ్యూరో: వరద సాయం రెండు విడతల్లో పంపిణీ చేసినా తమకు ఇప్పటివరకు అందలేదని బాధితులు చేపట్టిన ధర్నాతో బల్దియా దద్దరిల్లింది. సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద వేల సంఖ్యలో మహిళలు తమ ఆధార్‌కార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఓనర్లకే డబ్బులు ఇచ్చి చేతులు దులుకున్నారని, తాము నష్టపోయామని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని.. చిన్న పిల్లలతో వచ్చి నిరసన తెలిపారు. ఇప్పటికీ తామే అసలు బాధితులమని నినాదాలు చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు […]

Update: 2020-11-09 07:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వరద సాయం రెండు విడతల్లో పంపిణీ చేసినా తమకు ఇప్పటివరకు అందలేదని బాధితులు చేపట్టిన ధర్నాతో బల్దియా దద్దరిల్లింది. సోమవారం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద వేల సంఖ్యలో మహిళలు తమ ఆధార్‌కార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఓనర్లకే డబ్బులు ఇచ్చి చేతులు దులుకున్నారని, తాము నష్టపోయామని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని.. చిన్న పిల్లలతో వచ్చి నిరసన తెలిపారు. ఇప్పటికీ తామే అసలు బాధితులమని నినాదాలు చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన వ్యక్తం చేశారు. అటు.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ఆఫీస్‌కు భారీగా చేరుకున్న కార్యకర్తలు.. బాధితులకు సంఘీభావం తెలిపి వరదలతో నష్టపోయిన వారికి సాయం చేయాలని డిమాండ్ చేశారు.

అయితే.. కొందరు బాధితులు స్వయంగా రాగా మరికొందరు రాజకీయ నాయకులతో కలిసి వచ్చారు. వరద బాధితులకు పరిహారం ఇవ్వాలని ఆమ్ అద్మీ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.550 కోట్లలో ఇప్పటికే 90 శాతానికి పైగా అందజేసినట్టు జీహెచ్ఎంసీ కార్యాలయం వెల్లడిస్తోంది.

Tags:    

Similar News