నోకియా నుంచి 43″ స్మార్ట్ టీవీ

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్ఐ, రిలయన్స్, సామ్‌సంగ్, ఎల్‌జీ.. ఇలా అన్ని కంపెనీలు తమ తమ బ్రాండ్ స్మార్ట్ టీవీలను సేల్ చేస్తున్నాయి. నోకియా కూడా గతేడాదే స్మార్ట్ టీవీ మార్కెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 55 ఇంచుల టీవీని గత డిసెంబర్‌లోనే ఇండియాలో లాంచ్ చేసిన నోకియా.. ఈ రోజు (గురువారం, జూన్ 4, ) 43 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీని ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో మ.12 గంటలకు విడుదల చేసింది. […]

Update: 2020-06-04 01:03 GMT

దిశ, వెబ్ డెస్క్ :
ఎమ్ఐ, రిలయన్స్, సామ్‌సంగ్, ఎల్‌జీ.. ఇలా అన్ని కంపెనీలు తమ తమ బ్రాండ్ స్మార్ట్ టీవీలను సేల్ చేస్తున్నాయి. నోకియా కూడా గతేడాదే స్మార్ట్ టీవీ మార్కెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 55 ఇంచుల టీవీని గత డిసెంబర్‌లోనే ఇండియాలో లాంచ్ చేసిన నోకియా.. ఈ రోజు (గురువారం, జూన్ 4, ) 43 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీని ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో మ.12 గంటలకు విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ ధర రూ.31999/-గా నిర్ణయించింది. ఈ టీవీ మార్చిలోనే మార్కెట్లోకి రావాల్సి ఉండగా.. కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైంది. కాగా ఇందులో జేబీఎల్ ఆడియో, డాల్బీ విజన్ సపోర్ట్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

నోకియా స్మార్ట్ టీవీ ఫీచర్స్ :

స్క్రీన్ : 43 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ (UHD)
విజన్ : డాల్బీ విజన్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 9.0

ఇన్‌బిల్ట్ గూగుల్ ప్లే స్టోర్, జేబీఎల్, డాల్బీ ఆడియో, డీటీఎస్ ట్రూ సరౌండ్ సపోర్ట్ అదనపు ప్రత్యేకతలు

ఇక డిజైన్ విషయానికొస్తే.. నోకియా గతంలో లాంచ్ చేసిన 55 ఇంచుల టీవీ మాదిరే ఉంటుంది. ఈ రెండు టీవీల్లోనూ ఫీచర్లన్నీ దాదాపు ఒకేవిధంగా ఉన్నాయి. క్వాడ్ కోర్ ప్రాసెసర్ రన్ అయ్యే 55 ఇంచుల నోకియా స్మార్ట్ టీవీ.. 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌తో పాటు 2W స్పీకర్, DTS ట్రూ సరౌండ్ డాల్బీ ఆడియోను కలిగి ఉంది. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ – హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో యాప్స్ సపోర్ట్ ఉంది. ఈ యాప్స్ సపోర్ట్ మొత్తం 43 ఇంచుల టీవీలోనూ ఉంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రియల్‌మీ రీసెంట్‌గా 32, 43 ఇంచుల స్మార్ట్ టీవీలను మార్కెట్లో రిలీజ్ చేసింది. వాటి ధరలు, రూ.12,999/-, రూ. 21,999/- గా ఉన్నాయి. దాంతో నోకియా విడుదల చేస్తున్న 43 ఇంచుల టీవీకి, రియల్‌మీ నుంచి గట్టి పోటీ ఎదురవనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News