భారత్, రష్యా మధ్య విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఇందులో భాగంగానే ఇతర దేశాల నుంచి విమాన రాకపోకలను నిషేధించాయి. అయితే తాజాగా పరిస్థితులు కొంచెం అదుపులోకి వస్తుండటంతో కొన్ని దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాయి. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాయ విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తాజాగా రష్యా ఈనెల 27 నుంచి అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా భారత్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఇందులో భాగంగానే ఇతర దేశాల నుంచి విమాన రాకపోకలను నిషేధించాయి. అయితే తాజాగా పరిస్థితులు కొంచెం అదుపులోకి వస్తుండటంతో కొన్ని దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాయి. ఇప్పటికే పలు దేశాలు అంతర్జాయ విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. తాజాగా రష్యా ఈనెల 27 నుంచి అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా భారత్‌కు విమాన సర్వీసులు నడిపే దిశగా చర్యలు చేపట్టింది. భారత్‌తో పాటు ఫిన్లాండ్, వియత్నాం, ఖతార్‌కు కూడా రష్యా విమానాలు నడిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఉప ప్రధాని టటియానా గోలికోవా నేతృత్వం వహిస్ఉతన్న రష్యన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తాజాగా కీలక ప్రకటన చేసింది. జనవరి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే భారత్‌కు కూడా విమానాలు నడపనున్నట్లు తెలిపింది. మాస్కో-ఢిల్లీ మధ్య వారానికి రెండు సర్వీసులు నడిపిస్తామని వెల్లడించింది.