ఫ్లాష్.. ఫ్లాష్.. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌‌లో కిడ్నాప్

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తల్లితో కలిసి షాపింగ్ మాల్‌కు వచ్చిన చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అప్పటి వరకు వారి కళ్ల ముందే ఆడుకున్న బాలిక క్షణాల్లో మాయం కావడంతో తల్లితోపాటు షాపింగ్ మాల్ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అంతా కలిసి వెతికినా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు జగిత్యాల జిల్లా […]

Update: 2021-10-08 07:44 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తల్లితో కలిసి షాపింగ్ మాల్‌కు వచ్చిన చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అప్పటి వరకు వారి కళ్ల ముందే ఆడుకున్న బాలిక క్షణాల్లో మాయం కావడంతో తల్లితోపాటు షాపింగ్ మాల్ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అంతా కలిసి వెతికినా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరేన్ తన తల్లీ, మూడేళ్ల కూతురు అస్‌కియా హనీ (3)తో కలిసి కొత్తబట్టలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. అమ్మమ్మ, తల్లి షాపింగ్ చేస్తుండగా చిన్నారి హనీ షాపింగ్ మాల్‌‌లో ఆడుకుంటుంది. అదే సమయంలో బురఖాలు ధరించిన ఇద్దరు మహిళలు వచ్చి చిన్నారిని అక్కడి నుంచి ఎత్తుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తల్లి.. హనీ కనిపించకపోవడంతో షాపింగ్ మాల్‌ అంతా వెతికారు. కానీ పాప ఎక్కడా కనిపించకపోవడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీస్‌లు వెంటనే సీసీటీవి ఫుటేజీలను పరిశీలించగా హనీని ఇద్దరు బురఖా ధరించిన మహిళలు కిడ్నాప్ చేసినట్లు స్పష్టంగా కనిపించింది. పోలీస్‌లు షాపింగ్ మాల్ సీసీ కెమెరాలే కాకుండా రోడ్డు వెంట ఉన్న వాటిని కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు అన్ని స్టేషన్లను అలర్ట్ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా, నగరంలోని చాలా సీసీ కెమెరాలు పని చేయట్లేదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే మూడేళ్ల చిన్నారి మిస్సింగ్ కావడం కలకలం సృష్టిస్తోంది.

Tags:    

Similar News