మిలీషియా సభ్యులు లొంగుబాటు
దిశ, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఐదుగురు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. గుడెం కొత్తవీధి పెదపాడు వైకుంఠపల్లికి చెందిన ఐదుగురు లొంగిపోయినట్టు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా లొంగుబాటుదారులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా- ఒడిశా ప్రాంతాల్లో మావోలు చేసే సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు వీరు ఐదుగురు సహకరించే వారన్నారు. మావోయిస్టుల సమావేశాలకు ప్రజలను సమకూర్చడం, పోలీసుల కూంబింగ్ సమాచారం మావోలకు చేరవేసే పనులను గత 15 ఏళ్లుగా చేస్తున్నారని తెలిపారు. […]
దిశ, విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఐదుగురు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. గుడెం కొత్తవీధి పెదపాడు వైకుంఠపల్లికి చెందిన ఐదుగురు లొంగిపోయినట్టు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా లొంగుబాటుదారులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా- ఒడిశా ప్రాంతాల్లో మావోలు చేసే సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు వీరు ఐదుగురు సహకరించే వారన్నారు.
మావోయిస్టుల సమావేశాలకు ప్రజలను సమకూర్చడం, పోలీసుల కూంబింగ్ సమాచారం మావోలకు చేరవేసే పనులను గత 15 ఏళ్లుగా చేస్తున్నారని తెలిపారు. మావోయిస్ట్ కమాండర్ కుంకుపూడి హరి ఆరెస్ట్ అయ్యాక పోలీసులు చేసే సేవా కార్యక్రమాలు చూసి, గిరిజనుల అభివృద్ధికి మద్దతుగానే పోలీసుల ఎదుట లొంగిపోయామని వారు తెలిపినట్లు ఏఎస్పీ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో కొర్ర లక్ష్మణరావు, తాంబేలు, తిలుసు బంగార్రాజు, కిల్లో రోబిన్, వంతల లక్ష్మణ్ రావు ఉన్నారు.