అప్పుల బాధ.. ఐదుగురు ఆత్మహత్య

దిశ, వెబ్‌డెస్క్: అప్పుల బాధ ఐదుగురి ఆయువు తీసింది. వ్యాపారం కోసం తీసుకున్న అప్పులు.. లాక్‌డౌన్ కారణంగా దివాలా తీయడంతో అండగా నిలిచిన అప్పు చివరకు ప్రాణానికి ముప్పుగా మారింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ముగ్గురు ఆడపిల్లలను అనాథలను చేయలేక కుటుంబంతో సహా తండ్రి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసోం రాష్ట్రంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాళ్లోకి వెళితే.. కోక్రఝార్ జిల్లా తుల్సిబిల్ టౌన్‌లో ఈ విషాద ఘటన వెలుగుచూసింది. ఇదే […]

Update: 2020-11-02 06:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: అప్పుల బాధ ఐదుగురి ఆయువు తీసింది. వ్యాపారం కోసం తీసుకున్న అప్పులు.. లాక్‌డౌన్ కారణంగా దివాలా తీయడంతో అండగా నిలిచిన అప్పు చివరకు ప్రాణానికి ముప్పుగా మారింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ముగ్గురు ఆడపిల్లలను అనాథలను చేయలేక కుటుంబంతో సహా తండ్రి సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసోం రాష్ట్రంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాళ్లోకి వెళితే..

కోక్రఝార్ జిల్లా తుల్సిబిల్ టౌన్‌లో ఈ విషాద ఘటన వెలుగుచూసింది. ఇదే ప్రాంతానికి చెందిన నిర్మల్ పాల్ వృత్తిరీత్య వ్యాపారం చేస్తుండేవాడు. నిర్మల్ పాల్‌కు భార్య మల్లిక(40), కూతళ్లు పూజ(25), నేహ(17), దీప(15) ఉన్నారు. గ్యాస్‌ సిలిండర్‌ల బిజినెస్ చేసే ఈయన దానిని విస్తరించేందుకు లాక్‌డౌన్ ముందు ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామంటూ స్థానిక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు.

దీనికి తోడు వ్యాపారం అభివృద్ధి కోసం మొత్తం 25 నుంచి 30 లక్షల రూపాయల వరకు అప్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇక వ్యాపారం కొనసాగుతున్న సమయంలోనే అప్పులు తీర్చుదామని ప్లాన్ వేశాడు. కానీ, కరోనా-లాక్‌డౌన్ దెబ్బకు కథ అడ్డం తిరిగింది. వ్యాపారం మొత్తం దివాలా తీయడంతో అప్పుల వేధింపులు ఎక్కువయ్యాయి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా వ్యాపారం కోలుకోలేక.. కుటుంబపోషణ భారమైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఆదివారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు ఐదుగురు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. సోమవారం ఉదయం అయినప్పటికీ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదని స్థానికులు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News