రోడ్ టెర్రర్.. వేర్వేరు చోట్ల ఐదుగురు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డు ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. ఏపీలో శనివారం ఉదయం రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో బైక్‌‌ను వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సురేంద్ర, కొండేటి చంటి, కండెల్లి సతీష్‌గా గుర్తించారు. అదే విధంగా విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.మరో ఇద్దరికి తీవ్రగాయాలు కగా, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి […]

Update: 2021-01-01 21:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డు ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. ఏపీలో శనివారం ఉదయం రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో బైక్‌‌ను వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సురేంద్ర, కొండేటి చంటి, కండెల్లి సతీష్‌గా గుర్తించారు. అదే విధంగా విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.మరో ఇద్దరికి తీవ్రగాయాలు కగా, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News