చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
దిశ, క్రైమ్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 17.5 తులాల గోల్డ్, 35తులాల పైగా వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కల్వకుర్తిలో టీచర్‌గా పనిచేసిన శ్రీనివాసరావు ముఠాను తయారు చేసుకొని చోరీలు చేయడం మొదలు పెట్టాడు. రాత్రి సమయంలో వేర్వేరు కాలనీలలో మోటారు సైకిళ్లపై తిరుగుతూ లాక్ చేసిన ఇండ్లను గుర్తించి వారి వద్ద ఉన్న పరికరాలతో తాళలు పగలగొట్టి నగదు, బంగారం, […]
దిశ, క్రైమ్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 17.5 తులాల గోల్డ్, 35తులాల పైగా వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో కల్వకుర్తిలో టీచర్‌గా పనిచేసిన శ్రీనివాసరావు ముఠాను తయారు చేసుకొని చోరీలు చేయడం మొదలు పెట్టాడు. రాత్రి సమయంలో వేర్వేరు కాలనీలలో మోటారు సైకిళ్లపై తిరుగుతూ లాక్ చేసిన ఇండ్లను గుర్తించి వారి వద్ద ఉన్న పరికరాలతో తాళలు పగలగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఇతర విలువైన వస్తువులను అపహరించేవారు. ఇలా కోసూరి శ్రీనివాసరావు (గ్యాంగ్ లీడర్ – ఏ1)పై 48కేసులు, రత్లావత్ శంకర్ నాయక్ (ఏ2) పై 51 కేసులు, మేళ్లచెరువు రామారావుపై 47కేసులు, చింతల సిసింద్రీపై 20కేసులు, మువ్వా సురేష్‌బాబుపై కేసులు నమోదయ్యాయి. చోరీ కేసుల ఫిర్యాదులతో నిఘా పెట్టిన పోలీసులు గురువారం ఐదుగురిని అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.