రెచ్చిపోతున్న కేటుగాళ్లు.. అక్రమంగా బ్లాక్ ఫంగస్ మెడిసిన్ విక్రయం
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో కరోనా మెడికల్ దందా మరోసారి వెలుగు చూసింది. తెలంగాణలో క్రమంగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్న తరుణంలో బ్లాక్ మార్కెట్లో కొందరు అక్రమార్కులు అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు బ్లాక్ ఫంగస్ క్యూర్‌గా పనిచేస్తాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది బ్లాక్ ఫంగస్ అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొ అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్‌ను రూ.35వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో కరోనా మెడికల్ దందా మరోసారి వెలుగు చూసింది. తెలంగాణలో క్రమంగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్న తరుణంలో బ్లాక్ మార్కెట్లో కొందరు అక్రమార్కులు అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు బ్లాక్ ఫంగస్ క్యూర్‌గా పనిచేస్తాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది బ్లాక్ ఫంగస్ అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొ అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్‌ను రూ.35వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.