భారత బాక్సర్లకు ఒలంపిక్ బెర్తులు ఖరారు

టోక్యోలో జరగనున్న ఒలంపిక్స్‌ – 2020కి ఐదుగురు భారత బాక్సర్లు అర్హత సాధించారు. పురుషుల 69 కేజీల విభాగంలో వికాస్ కృష్ణ, మహిళల 75 కేజీల విభాగంలో పూజా రాణి ఒలంపిక్ బెర్తులు ఖాయం చేసుకున్నారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ వేదికగా ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. దీనిలో సెమీస్‌కు క్వాలిఫై అయ్యే క్రీడాకారులకు ఒలింపిక్ బెర్తులు దక్కుతాయి. కాగా ఆదివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో వీరిద్దరూ గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించారు. ఇక 69 కేజీల పురుషుల […]

Update: 2020-03-09 07:07 GMT

టోక్యోలో జరగనున్న ఒలంపిక్స్‌ – 2020కి ఐదుగురు భారత బాక్సర్లు అర్హత సాధించారు. పురుషుల 69 కేజీల విభాగంలో వికాస్ కృష్ణ, మహిళల 75 కేజీల విభాగంలో పూజా రాణి ఒలంపిక్ బెర్తులు ఖాయం చేసుకున్నారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ వేదికగా ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. దీనిలో సెమీస్‌కు క్వాలిఫై అయ్యే క్రీడాకారులకు ఒలింపిక్ బెర్తులు దక్కుతాయి.

కాగా ఆదివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్‌లో వీరిద్దరూ గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించారు. ఇక 69 కేజీల పురుషుల విభాగంలో సతీష్ కుమార్, క్రిష్ణన్, మహిళల విభాగంలో పూజా రాణి, లవ్లీనా బోర్గోహైన్, 75 కేజీల పురుషుల విభాగంలో ఆశిష్ కుమార్‌లు కూడా సెమీస్ చేరి ఒలంపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ ఐదుగురు ఆసియా ఛాంపియన్‌షిప్‌ సెమీస్‌లో ఓడినా కాంస్య పతకాలు దక్కుతాయి. మరోవైపు భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కూడా 51 కేజీల విభాగంలో అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.

Tags: Olympics, Tokyo, Indian Boxers, Semi finals, Qualify

Tags:    

Similar News