కరోనాతో అనాథలైన పిల్లలు.. అమ్మగా మారిన అక్క

దిశ, తాండూరు: కరోనా మహమ్మారి ఎంతోమంది పచ్చటికాపురాలలో తీరని విషాదాన్ని నింపింది. ప్రపంచాన్ని కుదుపేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. కలో గంజో తింటూ ఉన్నదాంట్లో సర్దుకుని జీవిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాల్లో కరోనా కారుచీక్లను  నింపేసివెళ్లింది. తాండూరులో ఓ కుటుంబలోని  లోకం తెలియని చిన్నారులను  దిక్కులేనివారిగా చేసింది. పూర్తి వివరాలు ఇలా… మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ స్లీపర్ కాలనీలో నివసిస్తున్న కుటుంబంలో కరోనా కారుచీకట్లను నింపింది. తల్లి లేని  పిల్లలను ప్రయోజకులుగా మార్చాలన్న తలంపుతో కృషిచేస్తున్న కుటుంబ పెద్ద […]

Update: 2021-06-20 01:27 GMT

దిశ, తాండూరు: కరోనా మహమ్మారి ఎంతోమంది పచ్చటికాపురాలలో తీరని విషాదాన్ని నింపింది. ప్రపంచాన్ని కుదుపేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. కలో గంజో తింటూ ఉన్నదాంట్లో సర్దుకుని జీవిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాల్లో కరోనా కారుచీక్లను నింపేసివెళ్లింది. తాండూరులో ఓ కుటుంబలోని లోకం తెలియని చిన్నారులను దిక్కులేనివారిగా చేసింది. పూర్తి వివరాలు ఇలా… మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ స్లీపర్ కాలనీలో నివసిస్తున్న కుటుంబంలో కరోనా కారుచీకట్లను నింపింది. తల్లి లేని పిల్లలను ప్రయోజకులుగా మార్చాలన్న తలంపుతో కృషిచేస్తున్న కుటుంబ పెద్ద కరోనాతో మృతిచెందడంతో వారికున్న ఐదుగురు పిల్లలు అనాధాలుగా మారారు.

 

తాండూరు పట్టణంలోని సాయిపూర్ స్లీపర్ కాలనీలో నివాసముంటున్న దాసరి బాలస్వామి (45) ఆటోలో తిరుగుతూ స్టీల్ సామాన్ల వ్యాపారం కొనసాగిస్తూ ఉండేవాడు ఇతనికి ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యలు మృతి చెందారు. మొదటి భార్య 2009 సంవత్సరంలో గుండెపోటుతో మృతి చెందింది. ఆమెకు ముగ్గురు సంతానం ప్రభాకర్, ప్రవీణ్ మంజుల… ప్రభాకర్ ఐటిఐ పూర్తి చేయగా ప్రవీణ్ 7వ తరగతి వరకు చదువుకొని మధ్యలో చదువు మానేసాడు. మంజుల 2వ తరగతి చదువుతుంది. మొదటి భార్య మాసమ్మ చనిపోయిన వెంబడే 2012లో బుజ్జమ్మను రెండవ వివాహం చేసుకున్నాడు. ఈమెకు ఇద్దరు సంతానం. శ్రీనివాస్(5), భవాని(2) తో మొత్తం ఐదుగురు సంతానం. ఈ క్రమంలో 2016 సంవత్సరంలో బుజ్జమ్మ కూడా మూర్ఛ వ్యాధితో మృతి చెందింది.

దీంతో పిల్లల ఆలనా పాలనా చూసేందుకు బాలస్వామి రేణుక అనే మహిళను మూడోవివాహంగా చేసుకున్నాడు. అయితే కుటుంబం కాస్త పెద్దగవ్వడంతో అందరూ కలిసి ఉండడానికి తాండూరు పట్టణానికి దగ్గరలో ఉన్న రాజీవ్ కాలనీలో బాలస్వామి బ్యాంకుతో పాటు ఇతర ఇతరమార్గాల ద్వారా 14 లక్షల అప్పు తీసుకుని ఇల్లు కూడా నిర్మించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తానికి కుటుంబం ఏదోరూపంలో కాలాన్ని వెళ్లదీస్తుంది. ఇలాంటి సమయంలో మే 22 తేదీన బాలస్వామికి దగ్గు, దమ్ము తీవ్రంగా రావటంతో తాండూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ కరోనా సోకిందని తేలడంతో పట్టణ శివారులో ఉన్న కొవిడ్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో ఏడు రోజులు చికిత్స పొందాడు. ఆస్పత్రిలో చుట్టూ ఉన్న వాతావరణాన్ని తట్టుకోలేక బాలస్వామి తాను ఇంటి దగ్గరే చికిత్స తీసుకుంటానని చెప్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ 3 రోజులు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ పెద్దైన బాలస్వామి మృతి చెందడంతో ఐదుగురు పిల్లలు అనాథలుగా మారారు.

బాలస్వామి మూడో భార్య తల్లిగారింటికి వెళ్లడంతో ఐదుగురు బిడ్డల ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. దీంతో అమ్మమ్మ అయినటువంటి వెంకటమ్మ వాళ్ళని చేరదీసి వారి బాగోగులు చూసుకుంటుంది. బాలస్వామి పెద్ద కూతురైనా మంజుల.. తన చెల్లి భవానికి తానే అమ్మై ప్రతి పని చేసి పెడుతుంది. మరోవైపు అమ్మమ్మ వెంకటమ్మ మా ఆరోగ్యం బాగోలేదని మేమే ముసలివారిమై పోవడం జరిగిందని, అధికారులు కానీ ప్రభుత్వం కానీ మా పిల్లలని ఆదుకోవాలని దండాలు పెడుతూ ఆర్తిస్తుంది. మరోవైపు బాలస్వామి కుమారుడు ప్రభాకర్ మా నాన్న పైసా పైసా కూడా పెడుతూ నన్ను ఐటిఎ చదివించారు, నేను పాస్ అవడం కూడా జరిగిందని, నాతో పాటు ఉన్నా నా తమ్ముళ్ళు చెల్లెలకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఐదుగురు పిల్లలు అనాదలుగా మారిన విషయాన్ని తెలుసుకున్న చైల్డ్ లైన్ ప్రతినిధులు జ్యోతి, కౌన్సిలర్ నీరజ బాల్‌రెడ్డి వారికి నిత్యావసర సరుకులు అందించారు. పాఠశాలలో పున:ప్రారంభమైన వెంటనే వారిని హాస్టళ్లలో చేరుస్తామని తెలిపారు. అనాధాలుగా మారిన తమకు ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం అందించాలని శోకతప్త హృదయంతో వేడుకుంటున్నారు.

Tags:    

Similar News