రైస్ పుల్లింగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు
దిశ, జడ్చర్ల : జడ్చర్లలో రైస్ పుల్లింగ్ ముఠా పట్టుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జడ్చర్ల పట్టణ సీఐ వీరస్వామి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్ వనస్థలిపురంకి చెందిన రియల్ వ్యాపారి మధుకు గత 15 రోజుల క్రితం ముఠా సభ్యులు ఫోన్ చేసి తమకు భూగర్భంలో అక్షయపాత్రను మించిన అదృష్ట పాత్ర లభించిందని ఈ పాత్రకు ఉరుములు మెరుపులతోపాటు పిడుగు లను సైతం నియంత్రించే శక్తి ఉందని దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో […]
దిశ, జడ్చర్ల : జడ్చర్లలో రైస్ పుల్లింగ్ ముఠా పట్టుకొని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జడ్చర్ల పట్టణ సీఐ వీరస్వామి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్ వనస్థలిపురంకి చెందిన రియల్ వ్యాపారి మధుకు గత 15 రోజుల క్రితం ముఠా సభ్యులు ఫోన్ చేసి తమకు భూగర్భంలో అక్షయపాత్రను మించిన అదృష్ట పాత్ర లభించిందని ఈ పాత్రకు ఉరుములు మెరుపులతోపాటు పిడుగు లను సైతం నియంత్రించే శక్తి ఉందని దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలో పలుకుతుందని రియల్టర్ మధుకు ముఠా సభ్యులు నమ్మబలికారు. దీంతో వీరి మాటలకు ఆకర్షితుడైన మధు తన వద్ద కోట్లలో డబ్బులు లేవని ఎనిమిది లక్షలు ఇవ్వగలరని చెప్పడంతో దీంతో ముఠా సభ్యులు డీల్ కుదుర్చుకున్నారు.
తమ దగ్గర ఉన్న పాత్ర శక్తిని పరీక్షించడానికి జడ్చర్ల కు రావాల్సిందిగా మధుని కోరారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో కోట్లల్లో విలువ ఉన్న వస్తువును తనకు ఎనిమిది లక్షలకు ఇస్తామనడంతో, ముఠా సభ్యులపై అనుమానం వచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మధు 100 కు డయల్ చేసి జడ్చర్ల పోలీసులను ఆశ్రయించాడు. ముఠా సభ్యులు ఫోన్ చేసి ఓ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నామని డబ్బులు ఇస్తే పాత్ర ఇస్తామని చెప్పడంతో ముఠా ఉన్న చోటికి పోలీసులు సివిల్ డ్రెస్ లో చేరుకొని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొన్నామని, పోలీస్ స్టేషన్‌కు తరలించి సమగ్ర విచారణ చేపట్టామని అని సీఐ తెలిపారు. ఈ ఐదుగురు నిందితుల వద్దనుండి రాగి చెంబును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ప్రజలకు ఇలాంటి మోసపూరితమైన మాటలు ఎవరైనా చెబితే నమ్మవద్దని అనుమానం వచ్చిన వారిపై పోలీసులను ఆశ్రయించాలని ఆయన సూచించారు.