వృద్ధి రేటును సవరించిన ఫిచ్ రేటింగ్స్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ అంచనాలను 9.4 శాతం ప్రతికూలంగా సవరిస్తున్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ మంగళ వారం వెల్లడించింది. రెండో త్రైమాసికం తర్వాత ఆర్థికవ్యవస్థ అత్యంత వేగంగా రికవరీ వైపునకు మారుతున్న.. సందర్భంగా ఇదివరకు అంచనా వేసిన 10.5 శాతం ప్రతికూలతను కొంత మెరుగు పరుస్తున్నట్టు అభిప్రాయపడింది. కొవిడ్-19 మహమ్మారి తీవ్రమైన ఆర్థిక ఆటంకాలను కలిగించిందని, బ్యాలెన్స్ షీట్‌లను మెరుగు పరుచుకోవాల్సి వచ్చిందని గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో […]

Update: 2020-12-08 08:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ అంచనాలను 9.4 శాతం ప్రతికూలంగా సవరిస్తున్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ మంగళ వారం వెల్లడించింది. రెండో త్రైమాసికం తర్వాత ఆర్థికవ్యవస్థ అత్యంత వేగంగా రికవరీ వైపునకు మారుతున్న.. సందర్భంగా ఇదివరకు అంచనా వేసిన 10.5 శాతం ప్రతికూలతను కొంత మెరుగు పరుస్తున్నట్టు అభిప్రాయపడింది. కొవిడ్-19 మహమ్మారి తీవ్రమైన ఆర్థిక ఆటంకాలను కలిగించిందని, బ్యాలెన్స్ షీట్‌లను మెరుగు పరుచుకోవాల్సి వచ్చిందని గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్ నివేదికలో ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది.

దీంతో దీర్ఘ కాలిక ప్రణాళికలపై జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని ముందుకు తీసుకొచ్చిందని పిచ్ రేటింగ్స్ తెలిపింది. కరోనా వైరస్ సంబంధిత మాంద్యం నుంచి జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకుందని ఫిచ్ తెలిపింది. తొలి త్రైమాసికంలో భారత జీడీపీ 23.9 శాతం ప్రతికూలత నుంచి రెండో త్రైమాసికంలో 7.5 శాతం ప్రతికూలతకు మెరుగు పడిన సంగతి తెలిసిందే. ఉత్పత్తి రంగంలో కార్యకలాపాలు వేగంగా పుంజుకోవడంతో పరిశ్రమలు కరోనాకు ముందు స్థాయికి చేరుకున్నాయి. తయారీ పీఎంఐ మరింత మెరుగ్గా నమోదయ్యే అవకాశాలున్నాయని, ఆటో పరిశ్రమలో బలమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో తయారీ మరింత ఉత్సాహంగా ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది.

Tags:    

Similar News