చెరువులో భారీగా చేపలు మృతి

దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఒక చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్రిమి సంహారక మందు కలిపి మత్స్యకారులకు తీవ్ర నష్టాన్ని కలిగించారు. భైంసా మండలం చింతల్ బోరి గ్రామం పక్కన ఉన్న పోచమ్మ కుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో దాదాపు లక్ష వరకు చేపలు మృతి చెందినట్లు మత్స్యకారులు తెలిపారు. గత సంవత్సరం 50వేలు, ఈ సంవత్సరం కొత్తగా 50వేల చేప పిల్లలను పెంచేందుకు మత్స్యకారులు సీడ్ వేశారు. చెరువులో క్రిమిసంహారక రసాయన […]

Update: 2020-10-09 09:42 GMT

దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఒక చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్రిమి సంహారక మందు కలిపి మత్స్యకారులకు తీవ్ర నష్టాన్ని కలిగించారు. భైంసా మండలం చింతల్ బోరి గ్రామం పక్కన ఉన్న పోచమ్మ కుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో దాదాపు లక్ష వరకు చేపలు మృతి చెందినట్లు మత్స్యకారులు తెలిపారు. గత సంవత్సరం 50వేలు, ఈ సంవత్సరం కొత్తగా 50వేల చేప పిల్లలను పెంచేందుకు మత్స్యకారులు సీడ్ వేశారు. చెరువులో క్రిమిసంహారక రసాయన మందులు కలవడం వల్లనే చేపలు మృతిచెందాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News