విషాదం.. చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
దిశ, సంగెం : జీవన భృతి కోసం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన కొలువుల సంజీవ్(53) శనివారం తెల్లవారుజామున ఎలుగూర్ రంగంపేట పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో వలలు వేస్తుండగా అది కాళ్ళకు చుట్టుకొని నీటిలో పడి మృతి చెందాడు. మృతుడు సంజీవ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య యాదమ్మ(50) రంగంపేటలో నివాసం ఉంటుండగా.. చిన్న […]
దిశ, సంగెం : జీవన భృతి కోసం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన కొలువుల సంజీవ్(53) శనివారం తెల్లవారుజామున ఎలుగూర్ రంగంపేట పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో వలలు వేస్తుండగా అది కాళ్ళకు చుట్టుకొని నీటిలో పడి మృతి చెందాడు.
మృతుడు సంజీవ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. పెద్ద భార్య యాదమ్మ(50) రంగంపేటలో నివాసం ఉంటుండగా.. చిన్న భార్య రేణుక(40), ఇద్దరు కుమారులు సంజీవ్‌తో ఉంటున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న SI భాస్కర్ రెడ్డి మత్స్యకారుల సహాయంతో మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు.