మత్స్యశాఖ కమిషనర్ రాచకొండ సందర్శన
దిశ, నల్లగొండ: సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని రాచకొండ ప్రాంతాన్ని మత్స్యశాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణచంద్రప్ప సందర్శించారు. రాచప్పసమితి సభ్యులు కమిషనర్‌కు రాచకొండ పురాతన ఆలయాల చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ కమిషనర్ మాట్లాడుతూ.. దేశంలో చారిత్రక సంపద ఉన్న ప్రాంతాల్లో రాచకొండ ఒకటన్నారు. రాచకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు డైరెక్టర్ మల్లు నాయక్, రాచప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి సూరేపల్లి […]
దిశ, నల్లగొండ: సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని రాచకొండ ప్రాంతాన్ని మత్స్యశాఖ కమిషనర్ డాక్టర్ సువర్ణచంద్రప్ప సందర్శించారు. రాచప్పసమితి సభ్యులు కమిషనర్‌కు రాచకొండ పురాతన ఆలయాల చరిత్రను వివరించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ కమిషనర్ మాట్లాడుతూ.. దేశంలో చారిత్రక సంపద ఉన్న ప్రాంతాల్లో రాచకొండ ఒకటన్నారు. రాచకొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు డైరెక్టర్ మల్లు నాయక్, రాచప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి సూరేపల్లి వెంకటేశం, దేవరకొండ ఖిల్లా పరిరక్షణ సమితి సభ్యుడు ఫర్హాన్ ఖాన్ పాల్గొన్నారు.