ముగిసిన తొలిరోజు ఆట.. భారత్ స్కోర్ @36

దిశ, వెబ్‌డెస్క్: మొదటి టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా, రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన కనబర్చుతోంది. బాక్సింగ్ డే టెస్ట్‌లో ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియాపై భారత్ పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో వికెట్ కోల్పోయి 36 పరుగులు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్, పుజారా ఉన్నారు. అంతకుముందు దగ్గర టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్ అయ్యాడు. ఇదిలా ఉండగా, […]

Update: 2020-12-26 05:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: మొదటి టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా, రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన కనబర్చుతోంది. బాక్సింగ్ డే టెస్ట్‌లో ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియాపై భారత్ పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో వికెట్ కోల్పోయి 36 పరుగులు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్, పుజారా ఉన్నారు. అంతకుముందు దగ్గర టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్ అయ్యాడు. ఇదిలా ఉండగా, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆసీస్‌ను 195 పరుగులకే ఆలౌట్ చేశారు. బౌలింగ్‌లో బుమ్రా 4 వికెట్లు, అశ్విన్ 3, సిరాజ్ రెండు, జడేజా ఒక వికెట్ తీసుకుని ఆసీస్‌కు చుక్కలు చూచించారు.

భారత బౌలర్లు వేసిన బంతులను ధీటుగా ఎదుర్కొని, ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో మర్నూస్(48), హెడ్(38), వేడ్ 30 పరుగులతో గౌరవ స్కోరు సాధించారు. ఓపెనర్ జో బర్న్స్ డకౌట్ అయ్యి, బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు చిక్కాడు. ఆ తర్వాత జట్టు స్కోర్ 35 పరుగుల దగ్గర వేడ్ అవుటవ్వగా, వెంటనే స్టీవ్ స్మిత్ డకౌట్ అయ్యాడు. దీంతో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడింది. అనంతరం 124 పరుగుల దగ్గర నాలుగో వికెట్‌గా హెడ్ పెవిలియన్ చేరాడు. హాఫ్ సెంచరీ దిశగా వెళుతున్న మార్నస్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో 134 పరుగులకు ఆసీస్ 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎవరూ ఎక్కువ సేపు కుదురుకోలేక, వరుసగా భారత బౌలర్లకు వికెట్లు సమర్పించారు. మొదటి టెస్టు ఓటమిని చవిచూసిన భారత బౌలర్లు కసితో బౌలింగ్ చేయడంతో కంగారులు 195 పరుగులు మాత్రమే చేశారు.

Tags:    

Similar News