వచ్చేసింది పులి.. 'పుష్ప' రాజ్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్టర్ ఆఫ్ సిల్వర్ స్ర్కీన్ సుకుమార్, సామ్రాట్ ఆఫ్ మ్యూజిక్ దేవిశ్రీ.. ఈ ముగ్గురు కలిస్తే ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఆ మజాను ఆడియన్స్‌కు మరోసారి రుచి చూపించేందుకు ‘పుష్ప’ మూవీతో సిద్ధమయ్యారు ఈ టాలీవుడ్ స్టార్స్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న చిత్రంలో బన్నీ ‘పుష్ప రాజ్’గా మాస్ అవతార్‌లో కనిపించనున్నాడు. క్రిస్మస్ సందర్భంగా ఫస్ట్ పార్ట్ విడుదల […]

Update: 2021-08-13 01:41 GMT

దిశ, సినిమా : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్టర్ ఆఫ్ సిల్వర్ స్ర్కీన్ సుకుమార్, సామ్రాట్ ఆఫ్ మ్యూజిక్ దేవిశ్రీ.. ఈ ముగ్గురు కలిస్తే ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఆ మజాను ఆడియన్స్‌కు మరోసారి రుచి చూపించేందుకు ‘పుష్ప’ మూవీతో సిద్ధమయ్యారు ఈ టాలీవుడ్ స్టార్స్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న చిత్రంలో బన్నీ ‘పుష్ప రాజ్’గా మాస్ అవతార్‌లో కనిపించనున్నాడు. క్రిస్మస్ సందర్భంగా ఫస్ట్ పార్ట్ విడుదల కానుండగా.. తాజాగా సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక’ అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘వెలుతురు తింటది ఆకు.. ఆకుని తింటది మేక.. మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి.. పులినే తింటది చావు.. చావును తింటది కాలం.. కాలాన్ని తింటది కాళి.. ఇది మహా ఆకలి’ అంటూ సాగే పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ తన వాయిస్‌తో పాటకు ప్రాణం పోశాడు. కాగా ఈ పాట రిలీజైన 18 నిమిషాల్లోనే 100k వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది.

బన్నీ రెగ్యులర్ పాటలకు భిన్నంగా.. ఫుల్ మాస్ అప్పీల్‌తో వేసిన స్టెప్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన సాంగ్‌ను హిందీలో విశాల్‌ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్‌, తమిళంలో బెన్నీ దయాల్‌, మలయాళంలో రాహుల్‌ నంబియార్‌ ఈ సాంగ్ పాడారు. కాగా ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తుండటం విశేషం. ఇక అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌ రోల్‌లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్‌పై పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న సినిమాను నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Tags:    

Similar News