పాక్ ఆర్మీలో తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్

ఇస్తామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ తొలిసారిగా ఒక మహిళను లెఫ్టినెంట్ జనరల్‌గా ప్రమోట్ చేసింది. ఆ దేశ ఆర్మీలో గౌరవప్రదంగా భావించే త్రీస్టార్ ర్యాంక్ పొందిన మేజర్ జనరల్ నిగార్ జోహర్‌ను తొలి మహిళా సర్జన్ జనరల్‌గానూ నియామకం చేసింది. మేజర్ జనరల్ నిగార్ జోహర్‌ను తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్‌గా ప్రమోట్ చేసినట్టు ఇంటర్‌సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తీకర్ ట్వీట్ చేశారు. రావల్పిండిలోని ఆర్మీ మెడికల్ కాలేజీలో 1985లో నిగార్ […]

Update: 2020-07-01 07:43 GMT
పాక్ ఆర్మీలో తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్
  • whatsapp icon

ఇస్తామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ తొలిసారిగా ఒక మహిళను లెఫ్టినెంట్ జనరల్‌గా ప్రమోట్ చేసింది. ఆ దేశ ఆర్మీలో గౌరవప్రదంగా భావించే త్రీస్టార్ ర్యాంక్ పొందిన మేజర్ జనరల్ నిగార్ జోహర్‌ను తొలి మహిళా సర్జన్ జనరల్‌గానూ నియామకం చేసింది. మేజర్ జనరల్ నిగార్ జోహర్‌ను తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్‌గా ప్రమోట్ చేసినట్టు ఇంటర్‌సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తీకర్ ట్వీట్ చేశారు. రావల్పిండిలోని ఆర్మీ మెడికల్ కాలేజీలో 1985లో నిగార్ జోహర్ డిగ్రీ పట్టా పొందారు. అనంతరం ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో చేరారు. ఆమె తండ్రి, భర్త ఆర్మీలోనే సేవలందించారు.

Tags:    

Similar News