ఢిల్లీ సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌ ఐసీయూలో మంటలు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సఫ్దార్‌జంగ్ ప్రభుత్వ హాస్పిటల్‌లోని ఐసీయూ వార్డులో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్ స్టాఫ్, భద్రతా సిబ్బంది వెంటనే సుమారు 60 మంది పేషెంట్లను ఇతర వార్డుల్లోకి షిఫ్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తున్నది. ఘటన సమాచారం అందుకోగానే తొమ్మిది ఫైరింజన్లు హాస్పిటల్ చేరాయి. గంటల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తీసుకురాగలిగాయి. మూడు అంతస్తుల సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉదయం 6.35 గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించినట్టు […]

Update: 2021-03-30 23:35 GMT

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సఫ్దార్‌జంగ్ ప్రభుత్వ హాస్పిటల్‌లోని ఐసీయూ వార్డులో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్ స్టాఫ్, భద్రతా సిబ్బంది వెంటనే సుమారు 60 మంది పేషెంట్లను ఇతర వార్డుల్లోకి షిఫ్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తున్నది. ఘటన సమాచారం అందుకోగానే తొమ్మిది ఫైరింజన్లు హాస్పిటల్ చేరాయి. గంటల వ్యవధిలోనే మంటలను అదుపులోకి తీసుకురాగలిగాయి. మూడు అంతస్తుల సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉదయం 6.35 గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించినట్టు స్థానికులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఈ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్(పడకల ఆధారంగా) దేశంలోనే అతిపెద్దది.

Tags:    

Similar News