ఆసుపత్రిలో మంటలు.. కరోనా రోగులు మృతి

మాస్కో : కరోనా వైరస్ బారిన పడిన రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన రష్యాలో జరిగింది. కోవిడ్-19 వ్యాధికి చికిత్స కోసం కొంత మంది రోగులు సెయింట్ పిటర్స్‌బర్గ్‌లోని సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆసుపత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అధికారులు, వైద్యులు అప్రమత్తమై రోగులను బయటకు తరలించారు. అయితే వెంటిలేటర్‌పై ఉన్న ఐదుగురు రోగులను […]

Update: 2020-05-12 02:46 GMT

మాస్కో :

కరోనా వైరస్ బారిన పడిన రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన రష్యాలో జరిగింది. కోవిడ్-19 వ్యాధికి చికిత్స కోసం కొంత మంది రోగులు సెయింట్ పిటర్స్‌బర్గ్‌లోని సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కాగా, ఆసుపత్రిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అధికారులు, వైద్యులు అప్రమత్తమై రోగులను బయటకు తరలించారు. అయితే వెంటిలేటర్‌పై ఉన్న ఐదుగురు రోగులను సకాలంలో బయటకు చేర్చకపోవడంతో వారు మరణించినట్లు సమాచారం. అగ్నిప్రమాదంలో ఎంత మంది మృతి చెందారో అధికారులు ప్రకటించడం లేదు. దీంతో పలు అనుమానాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News