నిజామాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. షాట్ సర్క్యూ ట్ తో ఏకంగా..

దిశ, నిజామాబాద్ సిటి: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో అనుపమ ఇనిస్టిట్యూట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. అప్పటికే అగ్నికి ఇనిస్టిట్యూట్ లోని కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా ఆహుతయ్యాయి. సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది వెల్లడించారు. ఘటనా […]

Update: 2021-11-30 09:39 GMT

దిశ, నిజామాబాద్ సిటి: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో అనుపమ ఇనిస్టిట్యూట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్ని జ్వాలలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.

అప్పటికే అగ్నికి ఇనిస్టిట్యూట్ లోని కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా ఆహుతయ్యాయి. సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ ఎస్ఐ సాయినాథ్ దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News