పంజాగుట్ట ఫ్లై ఓవర్‌‌ వద్ద మరోసారి అగ్నిప్రమాదం

దిశ, వెబ్‌డెస్క్ : పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. మూడు రోజుల క్రితం ఇదే ఫ్లై ఓవర్ కింద ఫైబర్ డెకరేషన్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం అదే ప్రాంతంలో మళ్లీ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఫ్లై ఓవర్ పిల్లర్‌కు ఏర్పాటు చేసిన ఫైబర్ డెకరేషన్‌లో మంటలు రావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదం […]

Update: 2021-03-16 02:10 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. మూడు రోజుల క్రితం ఇదే ఫ్లై ఓవర్ కింద ఫైబర్ డెకరేషన్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం అదే ప్రాంతంలో మళ్లీ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఫ్లై ఓవర్ పిల్లర్‌కు ఏర్పాటు చేసిన ఫైబర్ డెకరేషన్‌లో మంటలు రావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు ఘటనలు జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Click Here For Video Post..

Tags:    

Similar News