‘సీరమ్’ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణ టీకా ‘కోవిషీల్డ్’ తయారీదారు కంపెనీ అయిన ‘సీరమ్‌’లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న సీరమ్ కంపెనీ టెర్మినల్ గేట్ నెంబర్-1 వద్ద ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడగా.. 10 ఫైర్ ఇంజిన్లు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ అగ్నిప్రమాదంలో ఐదుగురు కంపెనీ సిబ్బంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టడం లేదని, […]

Update: 2021-01-21 05:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణ టీకా ‘కోవిషీల్డ్’ తయారీదారు కంపెనీ అయిన ‘సీరమ్‌’లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న సీరమ్ కంపెనీ టెర్మినల్ గేట్ నెంబర్-1 వద్ద ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడగా.. 10 ఫైర్ ఇంజిన్లు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ అగ్నిప్రమాదంలో ఐదుగురు కంపెనీ సిబ్బంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టడం లేదని, దాంతో టీకా ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం ఉండదని యాజమాన్యం ప్రకటించింది.

సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్స్ తయారీ దారుగా పేరుగాంచినది. అయితే, ప్రస్తుతం సీరమ్ కంపెనీ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ కరోనా టీకా ‘ఆస్ట్రాజెనెకా’ను అభివృద్ధి చేస్తోంది. కాగా, ఇప్పటికే ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ భారత ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News