ఖమ్మం ఐటీసీ లేజర్ పార్క్‌లో ఘోర అగ్ని ప్రమాదం..
దిశ, మణుగూరు : ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్ పరిశ్రమలకు సంబంధించిన అనుబంధ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం ఉదయం ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలంలోని సంజీవ రెడ్డి పాలెం గ్రామంలో ఐటీసీ లేజర్ పార్క్ విభాగంలోని కిసాన్ సత్యనారాయణ లేజర్ ప్యాకింగ్ గోడౌన్‌లోని ఐటీసీ పేపర్ సీట్ కటింగ్ హౌస్‌లో ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో పేపర్ రోల్స్ భారీగా కాలిపోయి మంటలు ఎగిసిపడుతున్నాయి. […]
దిశ, మణుగూరు : ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్ పరిశ్రమలకు సంబంధించిన అనుబంధ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం ఉదయం ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలంలోని సంజీవ రెడ్డి పాలెం గ్రామంలో ఐటీసీ లేజర్ పార్క్ విభాగంలోని కిసాన్ సత్యనారాయణ లేజర్ ప్యాకింగ్ గోడౌన్‌లోని ఐటీసీ పేపర్ సీట్ కటింగ్ హౌస్‌లో ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో పేపర్ రోల్స్ భారీగా కాలిపోయి మంటలు ఎగిసిపడుతున్నాయి.
అగ్ని ప్రమాదంతో ఖరీదైన పేపర్ రూల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ఐటీసీ పరిశ్రమకు మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు సంస్థ అధికారులు అంచనా వేశారు. ప్రమాద సమయంలో గోడౌన్‌లో పని చేస్తున్న కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. గ్రామ సర్పంచ్, స్థానికులు వెంటనే స్పందించి కార్మికులను బయటకు తీసుకు రావడంతో పెను ప్రమాదం తప్పింది.
స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో మణుగూరు, భద్రాచలం నుంచి ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు భారీగా ఎగిసిపడడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో కార్మికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ జితేందర్.. అధికారులు, స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకొని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.