త్వరలో నాయీ బ్రాహ్మణులకు సాయం

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పరిస్థితుల్లో లాక్‌డౌన్ మొదలు అన్‌లాక్ వరకు నాయీ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తరఫున సాయం చేయాలని వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో లెక్కతేల్చే పని మొదలైంది. ఎంతమంది నాయీ బ్రాహ్మణులు సెలూన్లు పెట్టుకున్నారు, ఎంతమంది ఆలయాల్లో సంగీతకారులుగా ఉన్నారు, 50ఏళ్ళ వయసు పైబడినవారెంతమంది, వారికి ప్రస్తుతం అందుతున్న పథకాలపై వివరాలన్నింటి ఈనెల 31వ తేదీకల్లా పంపాల్సిందిగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ […]

Update: 2020-08-20 11:41 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పరిస్థితుల్లో లాక్‌డౌన్ మొదలు అన్‌లాక్ వరకు నాయీ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తరఫున సాయం చేయాలని వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో లెక్కతేల్చే పని మొదలైంది. ఎంతమంది నాయీ బ్రాహ్మణులు సెలూన్లు పెట్టుకున్నారు, ఎంతమంది ఆలయాల్లో సంగీతకారులుగా ఉన్నారు, 50ఏళ్ళ వయసు పైబడినవారెంతమంది, వారికి ప్రస్తుతం అందుతున్న పథకాలపై వివరాలన్నింటి ఈనెల 31వ తేదీకల్లా పంపాల్సిందిగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర నాయీ బ్రాహ్మణుల సహకార సొసైటీల సమాఖ్య అన్ని జిల్లాల డెవలప్‌మెంట్ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

Tags:    

Similar News