కిడ్నాపైన బాలుడు సేఫ్..
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. ఆ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. భిక్కనూర్ మండలం జంగంపల్లి చెక్‌పోస్ట్ వద్ద గతనెల 31న మహారాష్ట్రకు చెందిన దంపతుల రెండు నెలల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి మూడ్రోజులు గాలించారు. నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో 10 ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా ఉన్న […]
దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతమైంది. ఆ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. భిక్కనూర్ మండలం జంగంపల్లి చెక్‌పోస్ట్ వద్ద గతనెల 31న మహారాష్ట్రకు చెందిన దంపతుల రెండు నెలల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి మూడ్రోజులు గాలించారు.
నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో 10 ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఆటోను గుర్తించారు. అందులో ఉన్న వ్యక్తులను విచారించగా.. తామే కిడ్నాప్ చేసినట్లు అంగీకరించారు. సంగారెడ్డిలో పద్మ అనే మహిళ ఇంట్లో చిన్నారిని దాచినట్లు చెప్పారు.
బాబును కిడ్నాప్ చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ నలుగురు వ్యక్తులు ఓ గ్రూప్‌గా ఏర్పడి చిన్నారిని అమ్మేందుకు ప్రయత్నించారని విచారణలో తేలిందన్నారు. తమ చిన్నారిని క్షేమంగా అప్పగించిన తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.