కృష్ణా జిల్లాలో వైసీపీ, బీజేపీ బాహాబాహీ

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం చిట్యాలలో బీజేపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. చిట్యాలలో చెరువు మట్టి, గ్రావెల్ తవ్వకం విషయంలో బీజేపీకి చెందిన శ్రీధర్ రెడ్డిపై స్థానిక వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన శ్రీధర్‌రెడ్డిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి […]

Update: 2020-06-16 07:47 GMT
కృష్ణా జిల్లాలో వైసీపీ, బీజేపీ బాహాబాహీ
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం చిట్యాలలో బీజేపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే.. చిట్యాలలో చెరువు మట్టి, గ్రావెల్ తవ్వకం విషయంలో బీజేపీకి చెందిన శ్రీధర్ రెడ్డిపై స్థానిక వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. గాయపడిన శ్రీధర్‌రెడ్డిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News