మహిళా కానిస్టేబుల్ భర్త ఆత్మహత్య.. గాంధారిలో ఉద్రిక్త

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ ఎస్ఐ, మరో మహిళా కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టారు. ఇరువురికీ పెళ్లై కుటుంబాలున్నా.. వివాహేతర సంబంధం పెటుకున్నారు. అది తెలిసిన కానిస్టేబుల్ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారకర ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మహదేవులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. మహదేవులపల్లి గ్రామానికి చెందిన పెద్దోళ్ల శివాజీ(అశోక్)కి ఏఆర్ కానిస్టేబుల్ సంతోషితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో […]

Update: 2021-06-09 07:34 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ ఎస్ఐ, మరో మహిళా కానిస్టేబుల్ దారుణానికి ఒడిగట్టారు. ఇరువురికీ పెళ్లై కుటుంబాలున్నా.. వివాహేతర సంబంధం పెటుకున్నారు. అది తెలిసిన కానిస్టేబుల్ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారకర ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మహదేవులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే..

మహదేవులపల్లి గ్రామానికి చెందిన పెద్దోళ్ల శివాజీ(అశోక్)కి ఏఆర్ కానిస్టేబుల్ సంతోషితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సంతోషిణికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్ఐ శివ ప్రసాద్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన రెండు కుటుంబాల్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మూడునాలుగుసార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టి, ఇరువురినీ గట్టిగా మందలించారు. అయినా.. సంతోషిణి తీరులో మార్పు రాలేదు.

పెద్దల మధ్య గొడవ జరిగిన తర్వాత కూడా ఎస్ఐ విశప్రసాద్ రెడ్డి తాను లేనప్పుడు ఇంటికి రావడాన్ని గమనించిన శివాజీ తీవ్ర మనస్థాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో విషయం తెలిసిన శివాజీ కుటుంబసభ్యులు సంతోషిణి కుటుంబసభ్యులపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ఇరు కుటుంబాలను చెదరగొట్టారు. తమకు న్యాయం చేయాలని గాంధారి-కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. శివాజీ మృతికి కారకులైన కానిస్టేబుల్ సంతోషిణి, ఎస్ఐ శివ ప్రసాద్ రెడ్డిలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గాంధారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సంతోషిణి, శివ ప్రసాద్ రెడ్డిలపై అధికారుల ఆదేశాల మేరకు 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు గాంధారి ఎస్ఐ శంకర్ తెలిపారు.

Tags:    

Similar News