మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. పెనుమూరు మండలంలోని కార్తికేయపురం గ్రామానికి చెందిన సుకన్య తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఈమెకు ఐదేళ్ల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం సుకన్య బాలింత. 2 నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. అనంతరం ఆపరేషన్ చేయించుకుని కార్తికేయపురంలోని అత్తారింట్లో ఉంటుంది. అయితే ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పక్కనే ఉన్న ఓ […]
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లాలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. పెనుమూరు మండలంలోని కార్తికేయపురం గ్రామానికి చెందిన సుకన్య తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఈమెకు ఐదేళ్ల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం సుకన్య బాలింత. 2 నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. అనంతరం ఆపరేషన్ చేయించుకుని కార్తికేయపురంలోని అత్తారింట్లో ఉంటుంది. అయితే ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పక్కనే ఉన్న ఓ పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.