కన్న కూతురిపై అత్యాచారం.. 20 ఏండ్ల జైలు శిక్ష

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కన్న కూతురిపై లైంగికదాడికి ఒడిగట్టిన ఓ తండ్రికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా అడిషనల్ కోర్టు జడ్జి రఘునాథ్ రెడ్డి సోమవారం తీర్పు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గండీడ్ మండలం మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచన్ పల్లి గ్రామంలో గున్ని పెంటయ్య (44)అనే వ్యక్తి 2020 ఫిబ్రవరిలో తన సొంత కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ […]

Update: 2021-03-22 08:47 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: కన్న కూతురిపై లైంగికదాడికి ఒడిగట్టిన ఓ తండ్రికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మహబూబ్‌నగర్ జిల్లా అడిషనల్ కోర్టు జడ్జి రఘునాథ్ రెడ్డి సోమవారం తీర్పు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గండీడ్ మండలం మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచన్ పల్లి గ్రామంలో గున్ని పెంటయ్య (44)అనే వ్యక్తి 2020 ఫిబ్రవరిలో తన సొంత కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆధారాలతో సహా కోర్టులకు సమర్పించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంజులాదేవి బాధితురాలి తరఫున కోర్టులో వాదించారు. కేసు విచారణలో లభించిన సాక్షాధారాలు రుజువు కావడంతో ఘటనను తీవ్రంగా పరిగణించిన అడిషనల్ కోర్టు జడ్జి రఘునాథ్ రెడ్డి దోషికి 20 సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానాను విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు.

Tags:    

Similar News