తండ్రిని చంపిన కొడుకు.. తల్లిని అలా చేసినందుకే
దిశ, కల్వకుర్తి: కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురైన సంఘటన కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఊరుకొండ మండలం ఇప్పపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… దుబ్బు రాములు(45) అనే వ్యక్తి తాగుడుకు బానిసై భార్యను తరచూ కొడుతూ హింసించేవాడు. ఈ విషయం మహిళ తన కొడుకులైన విష్ణు, యాదగిరిలకు ఫోన్ చేసి చెప్పడంతో కొడుకులు ఇంటికి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత మృతుని పెద్దకొడుకు యాదగిరి తన తమ్ముడు విష్ణును […]
దిశ, కల్వకుర్తి: కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురైన సంఘటన కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఊరుకొండ మండలం ఇప్పపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… దుబ్బు రాములు(45) అనే వ్యక్తి తాగుడుకు బానిసై భార్యను తరచూ కొడుతూ హింసించేవాడు. ఈ విషయం మహిళ తన కొడుకులైన విష్ణు, యాదగిరిలకు ఫోన్ చేసి చెప్పడంతో కొడుకులు ఇంటికి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత మృతుని పెద్దకొడుకు యాదగిరి తన తమ్ముడు విష్ణును ఇంటివద్దే ఉంచి పొలం దగ్గరికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి విష్ణు తండ్రితో గొడవ పడుతూ ఉన్నాడు.
తల్లిని కొట్టాడనే కోపంతో కట్టేతో తలపై బలంగా కొట్టడం కొట్టగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. రాములు మార్గమధ్యలొనే చనిపోయినట్లు ఎస్సై పేర్కొన్నారు. తాగుడుకు బానిసై తల్లిని కొడుతున్నందున తండ్రిని చంపితే తల్లి సంతోషంగా ఉంటుందనే ఉద్ద్యేశ్యంతో విష్ణు తండ్రిని కొట్టినట్లు మృతుని పెద్ద కొడుకు యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.