వరి ధాన్యం కొనుగోలు సంగతేంటి.. రైతుల్లో తీవ్ర ఆందోళన

దిశ, పరకాల: హనుమకొండ జిల్లా పరకాల సబ్‌డివిజన్ పరిధిలో వరి కోతలు మొదలయ్యాయి. చిన్న చిన్న కుంటలు, వ్యవసాయ బావుల ద్వారా వేసిన వరి పొలాలు గత రెండు వారాలుగా కోస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో సుమారు 37 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ లెక్కన చూస్తే 90 వేల టన్నుల వరి ధాన్యం దిగుమతి కానున్నట్టు అంచనా వేస్తున్నారు. కానీ, నేటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో […]

Update: 2021-11-05 05:22 GMT

దిశ, పరకాల: హనుమకొండ జిల్లా పరకాల సబ్‌డివిజన్ పరిధిలో వరి కోతలు మొదలయ్యాయి. చిన్న చిన్న కుంటలు, వ్యవసాయ బావుల ద్వారా వేసిన వరి పొలాలు గత రెండు వారాలుగా కోస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో సుమారు 37 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ లెక్కన చూస్తే 90 వేల టన్నుల వరి ధాన్యం దిగుమతి కానున్నట్టు అంచనా వేస్తున్నారు. కానీ, నేటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

మరోవైపు వర్షాభావ పరిస్థితులు ఉండడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ధాన్యాన్ని ఇంటికి తరలించాలన్నా మరో చోట నిల్వ చేయాలంటే.. రవాణా ఖర్చులు, టార్పాలిన్లు, గన్ని సంచులతో పాటు నిల్వచేయడానికి సరైన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లముందు సరైన వసతి లేక కల్లల్లోనే ధాన్యాన్ని రాసులుగా పోసుకుని ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయని ఎదురుచూస్తున్నారు. నేటి వరకు ఐకేపీ సెంటర్లు, పీఎసీఎస్ఎస్ ధాన్యం కొనుగోలుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో వరి రైతుల ఆందోళనపెరిగింది. అసలు కొనుగోలు చేస్తారా.. లేదా.. అన్న మీమాంసలో ఉన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి వరి ధాన్యం కొనుగోలుకు చొరవ చూపాల్సిందిగా పరకాల సబ్ డివిజన్ రైతులు వేడుకుంటున్నారు.

Tags:    

Similar News