హన్మకొండలో స్వీట్లు పంచి.. మరోసారి కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన రైతులు
దిశ, హన్మకొండ టౌన్: రైతాంగ ఐక్య ఉద్యమం మోడీ ప్రభుత్వ మెడలు వంచి వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయించి చరిత్రను సృష్టించిందని, ఇదే స్ఫూర్తితో మద్దతు ధర, రుణ విముక్తి చట్టాలను సాధించేంతవరకు దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎస్ సీసీ రాష్ట్ర కన్వీనర్ వల్లెపు ఉపేందర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేష్, కో-కన్వినర్లు రాచర్ల బాలరాజు, సోమిడి శ్రీనివాస్ లు పిలుపునిచ్చారు. శనివారం అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ […]
దిశ, హన్మకొండ టౌన్: రైతాంగ ఐక్య ఉద్యమం మోడీ ప్రభుత్వ మెడలు వంచి వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయించి చరిత్రను సృష్టించిందని, ఇదే స్ఫూర్తితో మద్దతు ధర, రుణ విముక్తి చట్టాలను సాధించేంతవరకు దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎస్ సీసీ రాష్ట్ర కన్వీనర్ వల్లెపు ఉపేందర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేష్, కో-కన్వినర్లు రాచర్ల బాలరాజు, సోమిడి శ్రీనివాస్ లు పిలుపునిచ్చారు. శనివారం అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్ సీసీ) ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అండర్ బ్రిడ్జ్ నుంచి వరంగల్ బస్టాండ్ వరకు ఢిల్లీ రైతాంగ ఉద్యమ విజయోత్సవ ప్రదర్శన నిర్వహించి స్వీట్లు పంచారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధంగా రైతాంగ ఉద్యమం సాగిందని అన్నారు. భారత దేశ చరిత్రలో రాజకీయాలకు అతీతంగా జరిగిన చారిత్రాత్మక ఉద్యమ ఘట్టమని, భావితరాలకు ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. సమాజం బతికి బట్ట కట్టాలంటే రైతాంగాన్ని రక్షించకుండా సాధ్యం కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ సీసీ జిల్లా నాయకులు నెట్టం నారాయణ, సుద్ధమల్ల భాస్కర్, వల్లందాసు కుమార్, ఎన్రెడ్డి హంసా రెడ్డి, ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి, న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు బండి కోటేశ్వరరావు, నలిగంటి పాల్ వివిధ ప్రజా సంఘాల నాయకులు పనాస ప్రసాద్, ఓదెల రాజన్న,ఐతం నాగేష్, కర్ర రాజిరెడ్డి, సత్యనారాయణ, మడ్డీ రాజారాం, భాషి పాక అశోక్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.