‘మన్ కీ బాత్’లో ప్లేట్లు వాయించిన రైతులు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రసంగం ప్రారంభించగానే ఆందోళన చేస్తున్న రైతులు ప్లేట్లు వాయించి నిరసన తెలిపారు. ‘మోడీ, మీ మన్ కీ బాత్ విని అలసిపోయాం. మా మనోగతాన్ని ఎప్పుడు ఆలకిస్తారు?’ అని నినాదాలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు ఈ నిరసన చేపట్టారు. సింఘు బార్డర్, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్, హర్యానాలోని రోహతక్‌లో ఈ ప్రదర్శనలు జరిగాయి. […]
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రసంగం ప్రారంభించగానే ఆందోళన చేస్తున్న రైతులు ప్లేట్లు వాయించి నిరసన తెలిపారు. ‘మోడీ, మీ మన్ కీ బాత్ విని అలసిపోయాం. మా మనోగతాన్ని ఎప్పుడు ఆలకిస్తారు?’ అని నినాదాలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు ఈ నిరసన చేపట్టారు. సింఘు బార్డర్, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్, హర్యానాలోని రోహతక్‌లో ఈ ప్రదర్శనలు జరిగాయి.
గత ఆదివారం ఈ నిరసన కార్యక్రమాన్ని రైతు నేత యోగేంద్ర యాదవ్ ప్రకటిస్తూ, మన్ కీ బాత్ కార్యక్రమం ఆసాంతం ప్లేట్లు, వంట సామగ్రి చప్పుడు చేస్తూ నిరసన చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఆయన ‘మన్ కీ బాత్’ వినిపించకుండా ప్లేట్లు వాయించాలని పేర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్ కాలంలో తొలిసారిగా ప్లేట్లు వాయించే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ చప్పుళ్లతో సంఘీభావాన్ని తెలుపుకోవాలని సూచించారు.