కబ్జా కోరులపై చర్యలు తీసుకోండి

దిశ, కామారెడ్డి: సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుకు సంబందించిన 5 ఎకరాల శిఖం స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టెక్రియాల్ జాతీయ రహదారిపై చెరువు ఆయకట్టు ఆరు గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి రహదారిని దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చెరువుకు సంబందించిన 5 ఎకరాల భూమిలో కొందరు వ్యక్తులు వెంచర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. వారిపై ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ […]

Update: 2021-02-22 01:55 GMT

దిశ, కామారెడ్డి: సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుకు సంబందించిన 5 ఎకరాల శిఖం స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టెక్రియాల్ జాతీయ రహదారిపై చెరువు ఆయకట్టు ఆరు గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి రహదారిని దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చెరువుకు సంబందించిన 5 ఎకరాల భూమిలో కొందరు వ్యక్తులు వెంచర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. వారిపై ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారని మండిపడ్డారు.

ధర్నా విషయం తెలుసుకున్న కామారెడ్డి రూరల్ సిఐ ఆందోళన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. చెరువు కబ్జా స్థలాన్ని పరిశీలించి కలెక్టర్‌తో మాట్లాడదామని సముదాయించడంతో తహసీల్దార్, సీఐతో కలిసి రైతులు స్థలాన్ని పరిశీలించారు. కబ్జా జరిగిన విధానాన్ని రైతులు వివరించారు. దీంతో ఈ నెల 25 వరకు సర్వే పూర్తి చేసి హద్దులు గుర్తిస్తామని తహసీల్దార్ ప్రేమ్ కుమార్ హామీ ఇచ్చారు. అలాగే వారి వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.

అనంతరం రైతులు మాట్లాడుతూ.. రైతులకు సాగునీరుకు ఇబ్బంది కావద్దని మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడిక పనులు చేపడుతుంటే కొందరు వ్యక్తులు చెరువు స్థలాన్ని కబ్జా చేస్తున్నారన్నారు. తల్లి లాంటి చెరువుపై కన్నెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కబ్జా కోరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారం రోజుల తర్వాత ఆయకట్టు గ్రామాల రైతులు తమ కుటుంబాలతో సహా వచ్చి రహదారిపై ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..