ఓ వైపు ఆవిర్భావ వేడుకలు.. మరోవైపు రైతుల ఆందోళనలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ రైతుల ఆందోళనలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడెక్కారు. పిట్లం మండలం రాంపూర్‌లో భారీగా రోడ్డు మీదకు వచ్చిన రైతులు వాహనాలకు అడ్డుగా భైఠాయించారు. ఈ ధర్నాతో పిట్లం-బాన్సువాడ మధ్య వాహనాలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎక్కువగా రైతులు జొన్నలనే పండిస్తున్నారని.. అయినా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ రైతుల ఆందోళనలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడెక్కారు. పిట్లం మండలం రాంపూర్‌లో భారీగా రోడ్డు మీదకు వచ్చిన రైతులు వాహనాలకు అడ్డుగా భైఠాయించారు. ఈ ధర్నాతో పిట్లం-బాన్సువాడ మధ్య వాహనాలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఎక్కువగా రైతులు జొన్నలనే పండిస్తున్నారని.. అయినా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం ఏంటని ఆందోళన కారులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.