తూకంలో తేడా.. రైతుల ఆందోళన
దిశ, నిజామాబాద్: తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ నగర శివారు ఖానాపూర్ గ్రామంలోని పూజ ధర్మకాంట వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఖానాపూర్‌లోని రైస్ మిల్లులకు తీసుకువచ్చారు. మిల్లర్లకు ధాన్యాన్ని అప్పగించే ముందు ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిలో తూకం వేయించారు. ఒక్కో లోడ్‌కు ఏడు క్వింటాళ్లు తక్కువ రావడంతో రైతులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్లు వే బ్రిడ్జిలను తనిఖీ […]
దిశ, నిజామాబాద్: తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారంటూ నిజామాబాద్ నగర శివారు ఖానాపూర్ గ్రామంలోని పూజ ధర్మకాంట వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఖానాపూర్‌లోని రైస్ మిల్లులకు తీసుకువచ్చారు. మిల్లర్లకు ధాన్యాన్ని అప్పగించే ముందు ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జిలో తూకం వేయించారు. ఒక్కో లోడ్‌కు ఏడు క్వింటాళ్లు తక్కువ రావడంతో రైతులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్లు వే బ్రిడ్జిలను తనిఖీ చేశారు. తూకాల్లో తేడాను గుర్తించి పూజ ధర్మకాంటను సీజ్ చేశారు. ఖానాపూర్, కాలూరులోని రైసు మిల్లుల యజమాన్యాలు ధర్మకాంట నిర్వాహకులతో కుమ్మకై ధాన్యం తూకాల్లో మోసాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
Tags: Nizamabad,farmers protest,crop