రెండేళ్లాయే భూములు తీసుకుని.. పరిహారం ఎప్పుడిస్తరు..?

దిశ, తిరుమలాయపాలెం : సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయామని, నేటికి రెండేండ్లు గడిచిందని ఇప్పటివరకు తమకు నష్టపరిహారం అందలేదంటూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై దమ్మాయిగూడెం వద్ద ఆరు గ్రామాల రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. రెండేళ్ల కింద సీతారామ ప్రాజెక్ట్ కోసం అధికారులు సర్వే చేసి తమ భూములను తీసుకున్నారని చెప్పారు. ఎకరానికి రూ.18 లక్షల చొప్పున ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పి నేటికి 18 నెలల […]

Update: 2021-12-16 10:11 GMT

దిశ, తిరుమలాయపాలెం : సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయామని, నేటికి రెండేండ్లు గడిచిందని ఇప్పటివరకు తమకు నష్టపరిహారం అందలేదంటూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై దమ్మాయిగూడెం వద్ద ఆరు గ్రామాల రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. రెండేళ్ల కింద సీతారామ ప్రాజెక్ట్ కోసం అధికారులు సర్వే చేసి తమ భూములను తీసుకున్నారని చెప్పారు.

ఎకరానికి రూ.18 లక్షల చొప్పున ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పి నేటికి 18 నెలల కాలం గడిచిపోయిందని, భూములు ఇచ్చిన రైతులకు నేటికి డబ్బులు చెల్లించలేదని మండలంలోని మెడిదపల్లి, గోపాయగూడెం, గోల్ తండా, దమ్మాయిగూడెం, బీరోలు, గ్రామాల రైతులతో పాటు కూసుమంచి మండలం పోచారం గ్రామ రైతులు కలిసి ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతంను కలిసి సీతారామ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన తమను వెంటనే ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు.

కలెక్టర్ విపి. గౌతమ్ స్పందిస్తూ అట్టి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. భూమి కోల్పోతున్న రైతులకు డబ్బులు చెల్లిస్తామని రైతులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో రైతులు దేవేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, ఎస్క్ అన్వర్, చీకటి శ్రీను, పాషా, ఖాజామియా, వెంకన్న, వీరన్న, మిరసాబ్, రాములు, ఉపేందర్, సత్యం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News