చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది.. మేము కొనం అంటున్న అధికారులు! ఎందుకంటే?

దిశ, లోకేశ్వరం : ధాన్యం పండించడానికి రైతులు పడే శ్రమ ఒక ఎత్తయితే దానిని అమ్మడానికి అన్నదాతలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. వారు పడుతున్న ఇబ్బందులు అధికారులను ఏ మాత్రం కదిలించడం లేదు. దీనితో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం విక్రయించడానికి 15 నుంచి నెలరోజుల వరకు రైతులు పడుతున్న అవస్థలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆన్‌లైన్ ఎంట్రీ ఉంటేనే ధాన్యం కొనుగోలు.. ఏ భూమిలో ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలు సాగుచేస్తున్నారు..? అనే […]

Update: 2021-11-21 11:53 GMT

దిశ, లోకేశ్వరం : ధాన్యం పండించడానికి రైతులు పడే శ్రమ ఒక ఎత్తయితే దానిని అమ్మడానికి అన్నదాతలు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. వారు పడుతున్న ఇబ్బందులు అధికారులను ఏ మాత్రం కదిలించడం లేదు. దీనితో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం విక్రయించడానికి 15 నుంచి నెలరోజుల వరకు రైతులు పడుతున్న అవస్థలు కంటతడి పెట్టిస్తున్నాయి.

ఆన్‌లైన్ ఎంట్రీ ఉంటేనే ధాన్యం కొనుగోలు..

ఏ భూమిలో ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలు సాగుచేస్తున్నారు..? అనే వివరాలను సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సీజన్ ప్రారంభంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. కానీ, చాలామంది ఏఈఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కూర్చున్న చోటనే పంటల వివరాలు రైతుల నుంచి సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల ధాన్యం పండించిన రైతులు అమ్ముకునేందుకు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ధాన్యం విక్రయించే రైతు పట్టా పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు అందజేయాల్సి ఉంది. ఆ రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయగానే రైతు మొబైల్ ఫోన్‌కు OTP వస్తుంది. దానిని నమోదు చేస్తేనే రైతుల వివరాలు ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతాయి. కానీ చాలా మంది రైతులకు ఓటీపీ రావడం లేదు. ఎందుకంటే ఆ సర్వే నంబర్‌లో వరి ధాన్యం బదులు ఇతర పంటలు సాగు చేసినట్లు ఆన్లైన్‌లో చూపిస్తోంది.

ఇతర రైతుల పేర్లతో ధాన్యం విక్రయం..

దీంతో గత్యంతరం లేక ఇతర రైతుల పేర్లతో ధాన్యం విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. కాగా, ధాన్యం డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన సందర్భంలో ఎంత జమ అయ్యాయో స్పష్టత లేక పలు గ్రామాల్లో రైతుల మధ్య గొడవలు జరుగుతున్న ఘటనలు నెలకొంటున్నాయి. ఇకనైనా అధికారులు రైతుల అవస్థలు గుర్తించి సమస్యను పరిష్కరించాల్సి ఉంది.

రైతులు సంప్రదిస్తే సమస్య పరిష్కరిస్తాం..

ధాన్యం పండించి ఆన్లైన్లో విస్తీర్ణం నమోదు కాని రైతులు సంబంధిత ఏఈఓను గానీ, మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో గానీ, సంప్రదిస్తే సరిదిద్ది రైతుల సమస్యలు పరిష్కరిస్తాం. అలాంటి రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలతో వీలైనంత త్వరలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.

-మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్

నాలుగు ఎకరాల్లో ఏ పంట వేయలేదు..

నాకు రాయపూర్ కాండ్లీ శివారులోని 518 సర్వేనెంబర్ లో 4.27 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేయగా 140 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని విక్రయించేందుకు వరి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లగా, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఆన్లైన్లో వివరాలు పరిశీలించి 20 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించడానికి మాత్రమే నేను అర్హుడని తెలిపారు. వెంటనే వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి విచారించగా ఆన్లైన్‌లో 27 గుంటల్లో మాత్రమే వరిసాగు చేసినట్లు సూచిస్తోంది. దీనితో మిగితా 120 క్వింటాళ్ల ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో తెలియక గత నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నాను. నాలాగే చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

-సాయరెడ్డి, రైతు రాయపూర్ కాండ్లి

Tags:    

Similar News