దేశభక్తి చాటిన యువ రైతు.. వరి చేనులో ఇండియన్ మ్యాప్..
దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్ జిల్లాకి చెందిన యువరైతు మవురమ్ మల్లిఖార్జున్ రెడ్డి దేశంపై తనకున్న దేశ భక్తిని చాటేందుకు వినూత్నంగా ఏదో చేయాలనుకున్నాడు. ఇందుకోసం తాను పండిస్తున్న వరిపైరునే ఎంచుకున్నాడు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ సందర్భంగా తన వరి పొలంలో ఇండియా మ్యాప్ రూపం కనిపించేలా నల్లటి వరిని నాటాడు. దీంతో పాటు ఆగస్టు 15 నుంచి ఏడాది పొడవునా తన పొలంలో జాతీయ జెండాను ఎగురవేస్తానని ఆయన ప్రకటించారు. మల్లిఖార్జున్ రెడ్డి […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరీంనగర్ జిల్లాకి చెందిన యువరైతు మవురమ్ మల్లిఖార్జున్ రెడ్డి దేశంపై తనకున్న దేశ భక్తిని చాటేందుకు వినూత్నంగా ఏదో చేయాలనుకున్నాడు. ఇందుకోసం తాను పండిస్తున్న వరిపైరునే ఎంచుకున్నాడు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ సందర్భంగా తన వరి పొలంలో ఇండియా మ్యాప్ రూపం కనిపించేలా నల్లటి వరిని నాటాడు.
దీంతో పాటు ఆగస్టు 15 నుంచి ఏడాది పొడవునా తన పొలంలో జాతీయ జెండాను ఎగురవేస్తానని ఆయన ప్రకటించారు. మల్లిఖార్జున్ రెడ్డి 2014లో తాను చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి తన భార్యతో కలిసి వ్యవసాయం మొదలెట్టారు. ఈయన కేవలం సేంద్రీయ పద్దతిలోనే పంటలు పండిస్తారు. దీనికి గాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అవార్డును కూడా గెలుచుకున్నారు.