ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెర్పోల్‌కు చెందిన రైతు శంకరయ్య( 55 ) వ్యవసాయ పనుల నిమిత్తం గతంలో ట్రాక్టరు కొనుగోలు చేశారు. దీంతో ఆయనకు తీవ్రంగా నష్టాలొచ్చాయి. భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు మరిన్నీ పెరిగాయి. దీంతో మనస్తాపం చెందిన శంకరయ్య సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని […]
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెర్పోల్‌కు చెందిన రైతు శంకరయ్య( 55 ) వ్యవసాయ పనుల నిమిత్తం గతంలో ట్రాక్టరు కొనుగోలు చేశారు. దీంతో ఆయనకు తీవ్రంగా నష్టాలొచ్చాయి. భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు మరిన్నీ పెరిగాయి. దీంతో మనస్తాపం చెందిన శంకరయ్య సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Tags: Farmer, suicide, financial, problems, medak, tractor