వ్యవసాయ మార్కెట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం
దిశ,పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ లో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నేలకొండపల్లికి చెందిన రైతు గడ్డం లింగయ్య 15 ఎకరాలు కౌలుకు తీసుకుని ధాన్యం పండించాడు. పంట కోసిన అనంతరం ధాన్యం అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చాడు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైన కాటాలు వేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన మార్కెట్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన మిగతా రైతులు వెంటనే […]
దిశ,పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ లో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నేలకొండపల్లికి చెందిన రైతు గడ్డం లింగయ్య 15 ఎకరాలు కౌలుకు తీసుకుని ధాన్యం పండించాడు. పంట కోసిన అనంతరం ధాన్యం అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చాడు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైన కాటాలు వేయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన మార్కెట్ లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
గమనించిన మిగతా రైతులు వెంటనే ఆయన్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా కాంటాలు వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి పంటల పండించామని, తీరా కొనుగోలులో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే మార్కెట్ కు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో రైతులందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.