ఉరేసుకుని రైతు ఆత్మహత్య

దిశ, మెదక్: ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నర్సింలు(55) తనకున్న రెండెకరాల్లో వరి పంట వేశాడు. పంట కాస్త చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోయింది. పంట చేతికి రాకపోవడం, అప్పులు తీర్చే మార్గం లేక బుధవారం రాత్రి నర్సయ్య పొలం వద్ద […]

Update: 2020-04-02 01:14 GMT

దిశ, మెదక్: ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట ఎండిపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నర్సింలు(55) తనకున్న రెండెకరాల్లో వరి పంట వేశాడు. పంట కాస్త చేతికొచ్చే సమయంలో నీరు లేక ఎండిపోయింది. పంట చేతికి రాకపోవడం, అప్పులు తీర్చే మార్గం లేక బుధవారం రాత్రి నర్సయ్య పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సింహకు రూ. 3లక్షల వరకు అప్పు ఉందని, ఆ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మహేందర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags : Farmer, suicide, medak, Water, dried crop

Tags:    

Similar News