ప్రభుత్వ ప్రకటనపై రైతు ధర్నా

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగును ఎత్తివేస్తూ, పంటల కొనుగోలు కేంద్రాలు ఉండవనే ప్రకటనపై ఒక రైతు ధర్నాకు దిగాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద శ్రీధర్ రెడ్డి అనే రైతు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనపై ధర్నా చేపట్టారు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది రైతులకు చాలా అసంతృప్తి కరమైన ప్రకటన అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోతే […]

Update: 2020-12-28 01:37 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగును ఎత్తివేస్తూ, పంటల కొనుగోలు కేంద్రాలు ఉండవనే ప్రకటనపై ఒక రైతు ధర్నాకు దిగాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద శ్రీధర్ రెడ్డి అనే రైతు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనపై ధర్నా చేపట్టారు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా రైతు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది రైతులకు చాలా అసంతృప్తి కరమైన ప్రకటన అన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోతే రైతుల పంటలు ఎవరు కొనాలని.. వారికి గిట్టుబాటు ధర ఎవరు ప్రకటించాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రకటనను ప్రభుత్వం వెనక్కు తీసుకునేంత వరకు తాను ఇక్కడ ధర్నా కొనసాగిస్తానని తెలిపారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ధర్నా చేయడానికి వీలు పడదని శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకోగా.. ఆయనకు మద్ధతుగా రైతులు పోలీసులను అడ్డుకున్నారు.

Tags:    

Similar News