విద్యుత్ అధికారులకు యువరైతు షాక్.. సమస్య తీరుస్తారా లేదా అంటూ..?

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఓ రైతు చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ నిలిపి హంగామా సృష్టించాడు. అతను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని అధికారులు నానా హైరానా పడ్డారు. ఈ ఘటన మాచారెడ్డి మండలం ఆరేపల్లి స్టేజి వద్ద చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన లింగారెడ్డి అనే రైతు ఆరేపల్లి స్టేజి వద్ద పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై […]

Update: 2021-08-18 07:11 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ఓ రైతు చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకుని రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ నిలిపి హంగామా సృష్టించాడు. అతను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోనని అధికారులు నానా హైరానా పడ్డారు. ఈ ఘటన మాచారెడ్డి మండలం ఆరేపల్లి స్టేజి వద్ద చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన లింగారెడ్డి అనే రైతు ఆరేపల్లి స్టేజి వద్ద పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని నడిరోడ్డుపై ట్రాక్టర్ నిలిపి హంగామా సృష్టించాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. గ్రామానికి చెందిన లింగారెడ్డి వ్యవసాయ పొలం వద్ద గత కొద్ది రోజులుగా ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతున్నది.

దానివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యుత్ అధికారులు ట్రాన్స్ ఫార్మర్‌కు మరమ్మత్తులు చేయాలని కోరగా పట్టించుకోవడం లేదు. దీంతో ఆవేదన చెందిన లింగారెడ్డి గ్రామ స్టేజి వద్ద ట్రాక్టర్‌ను నడిరోడ్డుపై ఆపి ట్రాక్టర్ పై నిలబడి పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఆ సమయంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విద్యుత్ అధికారులు, గ్రామస్తులు అక్కడికు చేరుకుని రైతు లింగారెడ్డికి సర్ది చెప్పారు. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించాడు. దీంతో విద్యుత్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News