బరితెగించిన సర్పంచ్ భర్త.. బలైన రైతు కుటుంబం
దిశ, నాగర్ కర్నూల్ : గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొలానికి కాలి బాట కోసం ఏర్పడిన పంచాయితీలో మనస్తాపం చెందిన ఓ రైతు కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి ఒడిగట్టింది. సంబంధిత గ్రామ సర్పంచ్ తమ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నాడని బాధిత రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం జనంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. […]
దిశ, నాగర్ కర్నూల్ : గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొలానికి కాలి బాట కోసం ఏర్పడిన పంచాయితీలో మనస్తాపం చెందిన ఓ రైతు కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి ఒడిగట్టింది. సంబంధిత గ్రామ సర్పంచ్ తమ కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నాడని బాధిత రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం జనంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బర్ల శేషయ్యకు గ్రామ శివారులో సర్వే నెంబర్ 178, 172లో కలిపి పది ఎకరాల పొలం ఉంది.
172 సర్వే నెంబర్‌లో గత 20 ఏళ్ల కిందట కొన్న పొలానికి కాలి బాట లేదంటూ గ్రామ సర్పంచ్ కవిత భర్త కురుమయ్య గ్రామంలో ప్రకృతి వనం కోసం బాధిత రైతు పొలంలోనే బాటను నిర్మించాడు. అలాగే బాధిత రైతు పొలంలో నాటిన మొక్కల మీదుగా నడక దారి కొనసాగిస్తున్నాడు. ఇదే అదునుగా భావించిన గ్రామ సర్పంచ్ భర్త పొలీసులతో బెదిరింపులకు పాల్పడున్నట్లు వారు ఆరోపించారు. దీంతో కొద్ది రోజులుగా గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడినా పట్టించుకోకుండా మంగళవారం ప్రకృతి వనానికి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తుండటంతో రైతు కుటుంబం మనస్తాపానికి గురైంది. దీంతో కుటుంబంలోని ముగ్గురు పురుగుల మందు సేవించి ఆత్మ హత్యాయత్నానికి ప్రయత్నించారు. బంధువులకు సమాచారం అందడంతో వారు 108 సాయంతో రైతు కుటుంబాన్ని నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, భార్య సాలమ్మ, కుమారుడు శ్రీశైలం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.