విషాదం.. కరెంట్ షాక్‌తో రైతు మృతి

దిశ, వేములవాడ : సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని కొలనూర్ గొల్లపల్లి గ్రామానికి చెందిన సూర సత్తయ్య (43) అనే రైతు ఆదివారం తెల్లవారుజామున విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. సత్తయ్య తన పొలం వద్ద కరెంటు పెట్టడానికి వెళ్లిన క్రమంలో స్టాటర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఘటనాస్థలిలోనే చనిపోయాడు. మృతుడు సత్తయ్యకు భార్య రాజేశ్వరి, కొడుకు తరుణ్, కూతురు కీర్తన ఉన్నారు. ఎస్ఐ రాజశేఖర్, విద్యుత్ అధికారి పృద్వీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. […]

Update: 2021-08-08 04:52 GMT

దిశ, వేములవాడ : సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని కొలనూర్ గొల్లపల్లి గ్రామానికి చెందిన సూర సత్తయ్య (43) అనే రైతు ఆదివారం తెల్లవారుజామున విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. సత్తయ్య తన పొలం వద్ద కరెంటు పెట్టడానికి వెళ్లిన క్రమంలో స్టాటర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఘటనాస్థలిలోనే చనిపోయాడు.

మృతుడు సత్తయ్యకు భార్య రాజేశ్వరి, కొడుకు తరుణ్, కూతురు కీర్తన ఉన్నారు. ఎస్ఐ రాజశేఖర్, విద్యుత్ అధికారి పృద్వీ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిరుపేద సత్తయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సత్తయ్య మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజేశేఖర్ తెలిపారు.

Tags:    

Similar News